మెట్రో న్యూస్
వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేటట్లుగా నిర్వహించారు.తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కల్వకుంట్ల కవిత, మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.విజేతలకు స్వయంగా బహుమతులు అందజేసి, మహిళల్లో ఆనందోత్సాహాలను నింపారు.
ప్రజల భాగస్వామ్యం… మహిళల సందడి… బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు, స్థానిక ప్రజలతో పాటు పలువురు పాల్గొన్నారు.