( మెట్రో న్యూస్ )
ఆర్మూర్ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘చెన్నై షాపింగ్ మాల్’ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అభ్యర్థిగా హాజరైన ప్రముఖ నటి,యాంకర్ శ్రీముఖి జ్యోతి ప్రజ్వలనం చేసి మాల్‌ను లాంఛనంగా ప్రారంభించారు.సొంత ప్రాంతంలో మాల్ ప్రారంభించడం సంతోషకరం అని అన్నారు.ఈ సందర్భంగా శ్రీముఖి మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.”నా జన్మస్థలమైన ఈ ప్రాంతానికి ఆర్మూర్/నిజామాబాద్ రావడం, ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్‌ను ప్రారంభించడం నాకు ఎంతో ప్రత్యేకమైనది మరియు సంతోషాన్ని ఇచ్చింది. ఇటీవల కామారెడ్డి, నిర్మల్‌లలో కూడా షాపింగ్ మాల్స్ ప్రారంభించాం.మాట ఇచ్చినట్లుగానే అక్టోబర్ 7న నా సొంత గడ్డపై ఈ మాల్‌ను ప్రారంభించడం నా హృదయానికి ఎంతో దగ్గరైన విషయం. ఈ ప్రాంత ప్రజలు ఫ్యాషన్ ప్రేమికులు కాబట్టి రాబోయే దసరా,దీపావళి మరియు శుభకార్యాల కొనుగోళ్ల కోసం ప్రతీ ఒక్కరూ చెన్నై షాపింగ్ మాల్‌ను సందర్శించి గ్రాండ్ సక్సెస్ చేయాలి”అని ఆమె కోరారు.ఈ ప్రారంభోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గోనె లహరి, మాజీ మున్సిపల్ చైర్మన్ స్వాతి బాబులు తదితర ప్రజాప్రతినిధులు,నగర ప్రముఖులు , ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.