(మెట్రో న్యూస్)
కామారెడ్డి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా గైని శ్రీనివాస్ గౌడ్ ను నియమించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం రాత్రి నియామక ఉత్తర్వులను జారీ చేసినట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షురాలు కవితకు కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో తెలంగాణ రక్షణ సమితి పార్టీ ప్రతిష్టవంతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లాలోని అన్ని మండల కమిటీలతో పాటు జిల్లా కమిటీని పటిష్టవంతంగా చేర్చిదిద్దుతానని అన్నారు. రాబోయే స్థానిక ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల లో పార్టీ అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తుందని గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు.