Take a fresh look at your lifestyle.

ఉద్యోగుల డిమాండ్లే ఎజెండానేడు తెలంగాణ కేబినెట్ భేటీ

0 16

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

తెలంగాణ మంత్రి వ‌ర్గ సమావేశం గురువారం జ‌ర‌గ‌నుంది. స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌తన మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీ-కేబినెట్ భేటీ ఉంటుంది. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మ‌స్యలే ప్ర‌ధాన ఎజెండాగా మంత్రిమండ‌లి స‌మావేశం ఉండ‌నుంది. డీఏలు, పీఆర్సీపై ఆందోళ‌న చేస్తున్న ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై కేబినెట్ భేటీలో చ‌ర్చించ‌నున్నారు. కేబినెట్‌లో చ‌ర్చించి… అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని ఇటీవ‌లే ఉద్యోగ సంఘాల జేఏసీకి డిప్యూటీ సీఎం హామీ ఇవ్వ‌డం తెల్సిందే. ద‌స‌రా పండుగ‌కు రెండు డీఏలు, సంక్రాంతి స‌మ‌యానికి మూడో డీఏ ఇవ్వడానికి ప్ర‌భుత్వం సూత్ర‌ప్రాయంగా అంగీక‌రించింది. పీఆర్సీ నివేదిక‌ను తెప్పించుకొని, వీలైనంత త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపింది.

మంత్రివ‌ర్గ భేటీపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్ష‌నర్లు ఆత్రుత‌గా ఉన్నారు. కాళేశ్వ‌రం పున‌రుద్ద‌ర‌ణ‌, తుమ్మిడిహ‌ట్టి ఎత్తు పెంచుకోవ‌డానికి మ‌హారాష్ట్ర అంగీకారం త‌దిత‌ర అంశాలూ చ‌ర్చ‌కు రానున్నాయి. స‌ర్ అంశం కూడా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఎలాగూ 22ఏ నిషేధిత జాబితా అంశం ఉండ‌నే ఉంది. ధ‌ర‌ణిని అడ్డం పెట్టుకొని కేసీఆర్ కుటుంబం చేసిన దోపిడీ, క‌ల్వ‌కుంట్ల కుటుంబం భూముల స‌ర్వే, త‌దిత‌ర అంశాల‌పైనా కేబినెట్ ఫోక‌స్ పెట్ట‌నుంది. సింగ‌రేణి కార్మికుల‌కు బోన‌స్‌పైనా నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.