Take a fresh look at your lifestyle.

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీ

0 4

హైదరాబాద్ (మెట్రో న్యూస్):

అసెంబ్లీ సమావేశాల నుండి బహిష్కరణకు గురైన బీఆర్ఎస్… శనివారం ‌మాక్ అసెంబ్లీ నిర్వహించింది. తెలంగాణ భవన్లో దీనికోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సెట్ వేశారు. బీఆర్ఎస్ సభ్యులే అధికార, ప్రతిపక్షాలుగా విడిపోయి సభా చర్చలలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పాత్రను తలసాని శ్రీనివాస్ యాదవ్ పోషించగా, స్పీకరుగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు వ్యవహరించారు. నీటి పారుదల మంత్రిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, రెవెన్యూ మంత్రిగా గంగుల కమలాకర్ జీవించారు. ఇదే అవకాశంగా గులాబీ ఎమ్మెల్యేలు… మంత్రులను ఆటాడుకున్నారు. ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే మైక్ ఇచ్చేది లేదు అని మాక్ అసెంబ్లీ స్పీకర్ మాణిక్ రావు మధ్యమధ్యలో అడ్డుకుంటు కనిపించారు. అంతేకాదు… స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వాలని
ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి పోడియం వద్దకు వెళ్లడం సన్నివేశాన్ని రక్తి కట్టించారు.

మాక్ అసెంబ్లీలో ముందుగా ఇరిగేషన్ పై ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చర్చను ప్రారంభిస్తూ… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి నీళ్ల విషయంలో అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరువు అని నిలదీశారు. ఇరిగేషన్ శాఖ మంత్రి పాత్రలో ఎమ్మెల్యే పల్లా స్పందిస్తూ… తాను ప్రిపేర్ అయి సభకు రాలేదనడంతో అంతా గొల్లుమన్నారు. సలహాదారుడు ఆదిత్యా నాథ్ దాస్ చెప్పినట్లు నేను మాట్లాడుతాను. బ్యాంకు చెక్కులు అంటే అర్థం అవుతుంది. క్యూసెక్కులు అంటే మాకు అర్థం కాదన్నారు.

ఈ దశలో ముఖ్యమంత్రి పాత్రధారి తలసాని జోక్యం చేసుకుని…‌మేము 100 రోజుల్లో హామీలు అమలు చేస్తాం అన్నాము.. కానీ ఏ వంద రోజుల్లో చెప్పామా? 5 ఏళ్ళు కాదు 25 ఏళ్ళు మిమే ఉంటాం..ఎప్పుడో ఒకప్పుడు చేస్తాం..నాకు చాల సమస్యలు ఉన్నాయి.. ఢిల్లీతో సమస్య.. పార్టీలో సమస్య.. ఆఖరికి బిఆర్ఎస్ వల్ల కూడా ప్రశాంతత లేదు.. ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చూశాము అన్నారు.

రెవిన్యూ శాఖ మంత్రి పాత్రలో గంగుల కమలాకర్ మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టిన. ఇప్పుడు నేను ఖర్చు పెట్టుకున్న డబ్బులు సంపాదించుకోవాలి.‌ భూ భారతీ కాదు…. భూ హారతి చేస్తాం. మైనింగ్ అంటే మై ఎర్నింగ్ అధ్యక్ష్య! అన్నారు.

Leave A Reply

Your email address will not be published.