Take a fresh look at your lifestyle.

బంగారం కోసం వేట సాగించే సమయం ఇది.

0 6

ఆసియా క్రీడల ఆరంభానికి ముందే మొదలైన క్రికెట్‌ పోటీల్లో భారత అమ్మాయిలు మరోసారి పసిడి మోత మోగేంచిందుకే సిద్ధమయ్యారు. మూడేండ్ల క్రితం  చైనా లో గత ఎడిషన్‌లో స్వర్ణం సాధించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన.. నగోయాలోనూ అదే ఫీట్‌ను రిపీట్‌ చేయాలనే లక్ష్యంతో బరిలో దిగుతోంది. గురువారం నుంచి మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో నాకౌట్‌ దశ నుంచే మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు.

  • ఆసియా గేమ్స్‌ బరిలో టీమిండియా.. నేడు జపాన్‌తో క్వార్టర్స్‌ పోరు
  • ఉదయం 10.30 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌లో

ఆసియా క్రీడల ఆరంభానికి ముందే మొదలైన క్రికెట్‌ పోటీల్లో భారత అమ్మాయిలు మరోసారి పసిడి మోత మోగేంచిందుకే సిద్ధమయ్యారు. మూడేండ్ల క్రితం చైనా లో గత ఎడిషన్‌లో స్వర్ణం సాధించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన.. నగోయాలోనూ అదే ఫీట్‌ను రిపీట్‌ చేయాలనే లక్ష్యంతో బరిలో దిగుతోంది. గురువారం నుంచి మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో నాకౌట్‌ దశ నుంచే మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. శుక్రవారం జరుగబోయే తొలి మ్యాచ్‌లో భారత్‌.. జపాన్‌తో క్వార్టర్‌ పోరుకు సిద్ధమైంది.

ఇటీవలే మహిళల ఆసియా కప్‌ను 8వ సారి గెలిచిన జోష్‌లో ఉన్న ఉమెన్‌ ఇన్‌ బ్లూ జోరు ముందు ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న జపాన్‌ కనీస పోటీనిస్తుందో లేదో చూడాలి. వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడి ఆట రైద్దెతే నిబంధనల ప్రకారం అత్యుత్తమ ర్యాంకులో ఉన్న టీమిండియానే సెమీస్‌ చేరే అవకాశం ఉంది.

సెమీస్‌కు బంగ్లా, పాక్‌

గురువారం జరిగిన క్వార్టర్స్‌ మ్యాచుల్లో పాకిస్థాన్‌.. థాయ్‌లాండ్‌పై కష్టపడి గెలిచి సెమీస్‌ చేరింది. బంగ్లాదేశ్‌, చైనా మధ్య జరగాల్సిన తొలి క్వార్టర్స్‌ వర్షం కారణంగా రద్దవడంతో బంగ్లా సెమీస్‌కు అర్హత సాధించింది.

Leave A Reply

Your email address will not be published.