Take a fresh look at your lifestyle.

అడవుల మధ్య ఘంటే గణపతి

0 2

(మెట్రో న్యూస్):

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా చందగులి గ్రామంలో అడవుల మధ్య ఘంటే గణపతి ఆలయం- కోరికలు తీరిన తర్వాత గంటలు కట్టి మొక్కులు తీర్చుకునే సంప్రదాయం ఏ శుభకార్యం ప్రారంభించినా, ఎలాంటి పూజ చేసినా మొదటగా వినాయకుడిని పూజించడం మన సంప్రదాయం. గణపతిని స్మరిస్తే తలపెట్టిన కార్యంలో ఎలాంటి విఘ్నాలు ఎదురుకావు అనే విశ్వాసం భక్తులలో ప్రబలంగా ఉంది. అంతేకాదు వినాయకుడు జ్ఞాన ప్రదాత.

బుద్ధికి, జ్ఞానానికి, విజ్ఞానానికి ప్రతీక. మహాభారతాన్ని వ్యాసుడు చెప్తుంటే, అత్యంత వేగంగా తన దంతం విరిచి మరీ మహాకావ్యంగా రాసిన ధీశాలి గణపతి. అలాంటి గణపతికి దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఆలయాలు కలవు. ముఖ్యంగా దక్షిణ భారతంలో గణపతిని విశేషంగా ఆరాధిస్తారు. గణపతి ప్రార్ధిస్తే ఇష్టకామ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం.
గణపతి మÖల మంత్రం
జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడు, మనసారా ఃఃఓం గం గణపతయే నమః అని స్వామివారిని స్మరించుకుంటే మనలో ఒక నమ్మకం, ఒక ధైర్యం కలుగుతుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని అతి ప్రాచీనమైన ఓ గణపతి క్షేత్రం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
ఘంటే గణపతి దేవాలయం
కర్ణాటక రాష్ట్రంలో వెలసిన ప్రముఖ వినాయక దేవాలయాలలో ఘంటే గణపతి దేవాలయం కూడా ఒకటి. కర్ణాటకలోని గోకర్ణ నుంచి దండేలి వెళ్లే మార్గంలో, దట్టమైన అడవుల మధ్య వెలసి ఉన్న గంట గణపతి దేవాలయం భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతోంది.
అభీష్టసిద్ధి కలిగించే ఘంటే గణపతి
ప్రకృతి అందాల నడుమ కొలువైన ఈ గణపతిని దర్శించుకోవడానికి ప్రతిరోజు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేస్తుంటారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజిస్తారు. మంచి మనసుతో, నమ్మకంతో గణపతిని ప్రార్ధిస్తే కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
మనసులోని బాధలు వినే గణపతి
మన మనసులోని బాధను చెప్పుకోవడానికి సాటి మనిషి లేకపోయినా, గణపతికి చెప్పుకుంటే చాలు. అందుకే ఘంటే గణపతి ఆలయాన్ని సందర్శించి మన కష్టాన్ని చెప్పుకుంటే చాలు ఆ గణపతి కరుణతో అనుగ్రహిస్తాడని నమ్మకం. అంతేకాదు మన కన్నీటిని అర్థం చేసుకునే తండ్రిలా, మన కష్టాలను తొలగించే తల్లిలా, విఘ్నేశ్వరుడు మన వెంట ఉంటాడని భక్తుల విశ్వాసం.
ఘంటే గణపతి ఆలయం ఎక్కడుంది?
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా, ఎల్లపూర్ సమీపంలోని చందగులి గ్రామంలో శ్రీ ఘంటే గణపతి ఆలయం కొలువై ఉంది.
పేరు వెనుక రహస్యం కన్నడ భాషలో ఁఘంటేఁ అనగా గంట అని అర్థం. భక్తులు తమ మనసులో కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత, స్వామి వారికి ఇక్కడ గంటలను కానుకగా సమర్పిస్తారు.
జాగృత క్షేత్రం
ఈ ఆలయంలో లక్షలాది గంటలు వేలాడదీసి ఉంటాయి. భక్తులు గంట మోగిస్తూ గణపతిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఇది చాలా శక్తివంతమైన జాగృత క్షేత్రంగా భక్తులు భావిస్తారు.
ఆలయ విశేషాలు
గర్భాలయంలో గణపతి మÖర్తి రమ్యంగా దర్శనమిస్తుంది. ఆలయం గోడలపైన, పైకప్పు మీద చెక్కతో తయారైన కళాకృతులు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. దట్టమైన అడవులు, పచ్చని ప్రకృతి మధ్య ప్రశాంతమైన వాతావరణంలో వెలసి ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించడం మరపురాని ఆధ్యాత్మిక అనుభూతి. ప్రశాంతతకు మారుపేరైన ఈ క్షేత్రంలో భక్తులు కొంతసేపు ధ్యానం చేసుకుంటారు.

పూజోత్సవాలు
గంట గణపతి ఆలయంలో ప్రతిరోజు జరిగే నిత్య పూజలతో పాటు ప్రతి బుధవారం, ఆదివారం స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అలాగే ప్రతి మాసంలో బహుళ పక్షంలో వచ్చే సంకటహర చతుర్థి రోజు స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు విశేషంగా జరుగుతాయి. ఇక గణేష్ నవరాత్రులు ఇక్కడ వైభవంగా జరుగుతాయి.

గంటల సమర్పణ
ఈ ఆలయంలో గణపతిని దర్శించి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయని విశ్వాసం. అనుకున్న పనులు పూర్తయ్యాక భక్తులు గణపతికి గంట సమర్పించి తమ మొక్కును తీర్చుకుంటారు. ఇలా భక్తులు సమర్పించిన అనేక గంటలు ఆలయ ప్రాంగణంలో దర్శనమిస్తాయి. మనం కూడా మన జీవితంలో విఘ్నాలు తొలగించి, కోరిన కార్యాలు నెరవేర్చి, సుఖశాంతులు చేకూరాలని ఘంటే గణపతిని ప్రార్థిద్దాం.

ఓం గం గణపతయే నమః

Leave A Reply

Your email address will not be published.