Take a fresh look at your lifestyle.

విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ పర్వీన్ సుల్తానా చోటుమియా

0 2

మెట్రోన్యూస్:-

ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఒకే విధమైన ఏకరూప దుస్తులను మండల కేంద్రమైన రేగోడు లోని ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పర్వీన్ సుల్తానా చోటు మియా, ఉప సర్పంచ్ ధనలక్ష్మి మల్లికార్జున్ చేతుల మీదుగా బుధవారం ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు.సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవడం ద్వారా కన్న తల్లిదండ్రులతోపాటు పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు అందించే సౌకర్యాలను, వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి తగినంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. విద్యార్థులకు అవసరమైన పలు సౌకర్యాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయురాలు సుశీల,అనూష, మరియు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రమేష్, నవీన్,సంజీవ్, ప్రతాప్, శివకుమార్, రాజశేఖర్, చంద్రశేఖర్,సత్యనారాయణ,సిఆర్ పి సంతోష్ కుమార్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం చంద్రకళ, స్రవంతి,పూజ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.