Take a fresh look at your lifestyle.

ఉపాధ్యాయులు మంచి సమాజ నిర్మాతలు -గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంజయ్య

0 4

మెట్రో న్యూస్ : విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులేనని,ఉపాధ్యాయులు మంచి సమాజ నిర్మాతలని గ్రంధాలయ సంస్థ చైర్మన్ జి.అంజయ్య అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించి,ఈసందర్భంగా మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమంను నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంజయ్య,మండల ప్రత్యేక అధికారి ఎ.జగదీష్,రాయికోడ్ ఏయంసి చైర్మన్ సుదాకర్ రెడ్డిలు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అతి పవిత్రమైనదని,ఉపాధ్యాయుల ద్వారానే అన్ని రంగాల్లోని నిపుణులు తయ్యారు అవుతారన్నారు.ఉపాధ్యాయులు కొవ్వొత్తి వంటి వారని,వారు కరిగిపోతూ శిశులకు విధ్య,విజ్ఞానం అందజేస్తారు.విలువలతో కూడిన సమాజ నిర్మాణం కేవలం ఉపాధ్యాయులకే సాద్యమని తెలిపారు.

అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాడానికి కృషి చేసిన సర్పంచులకు,ఉపాద్యాయులకు ప్రశంసించి శాలువాతో సన్మానించారు.జిల్లా స్థాయిలో,మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపబడి అవార్డు, సన్మానం పొందిన సన్మాన గ్రహీతలు ఈసందర్భంగా మాట్లాడుతూ ఈ అవార్డు,ప్రశంసలు,సన్మానాలు మాపై మరింత భాద్యతను పెంచాయని,ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించి,విద్యార్థుల తల్లిదండ్రుల మన్ననలు పొందుతామనీ తెలిపారు.కార్యక్రమంలో యంపిడిఓ షరీఫ్,యంఏఓ సారిక,యంఈఓ నర్సిములు,వివిధ పాఠశాలల పిజి ఎచ్ యంలు నగేష్,పీఆర్టీయు మండల అధ్యక్షుడు యాదవులు,ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సురేందర్,టిపిటిఆర్ అధ్యక్షుడు సుదాకర్,సర్పంచులు రాధ తుకారాం,మమతా వెంకట్ రెడ్డి,నాగేశ్వరరావు,నరేష్,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.