Take a fresh look at your lifestyle.

మట్టి గణపతి లతో పర్యావరణ పరిరక్షణ..

0 3

మెట్రో న్యూస్
.
గణపతి ఉత్సవాల్లో మట్టితో చేసిన ప్రతిమల వాడకం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించినావారిమవుతామని తెలంగాణ స్టేట్ కార్పొరేషన్ మాజి చైర్మన్ మఠం బిక్షపతి అన్నారు.
వినాయక చవితిని పురస్కరించుకొని జోగిపేటలో బీ అర్ ఎస్ నాయకులతో కలిసి ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల అంశంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రసాయనలతో కూడిన ప్రతిమలను చెరువులలో నిమజ్జనం చేయడం మూలంగా జంతుజాలం చనిపోవడంతో పాటు, నీటి కాలుష్యం ఏర్పడుతుందన్నారు. తాను గత 11 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ప్రజలందరికీ ఉచితంగా మట్టి వినాయకులు పంపిణీ చేసి ప్రజలలో అవగాహన కల్పిస్తున్నానన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించి మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని ప్రకృతి పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ వినాయక చవితి పర్వదినాన్ని సుఖసంతోషాలతో వైభవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జోగిపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ మల్లికార్జున గుప్తా,వేరేశం గుప్తా, మహేష్ యాదవ్,ఊస నాగరాజు, ఆకుల శంకర్, ఫైసల్, సయ్య సాయి,నాగరాజు, నర్సింహా, నవీన్, శ్రీశైలం, భరత్, సోహెల్, ఏజస్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.