Take a fresh look at your lifestyle.

ఫీజు బకాయిలపై బీఆర్ఎస్వి అసెంబ్లీ ముట్టడి భగ్నం

0 5

హైదరాబాద్ (మెట్రో న్యూస్)

ఫీజు రీఇంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని, పాలిటెక్నిక్ జీవో 97 రద్దు చేయాలని బీఆర్ఎస్వి చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. శుక్రవారం ఉదయం ఎల్బి స్టేడియం నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరిన బీఆర్ఎస్వి నాయకులు, విద్యార్థులను పోలీసులు ఆరంభంలోనే అడ్డుకున్నారు. బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా పలువురిని ఈ సందర్భంగా అరెస్టు చేశారు. ఫీజు రీఇంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే
చెల్లించాలని, పాలిటెక్నిక్ జీవో 97 రద్దు చేయాలని వారంతా నినాదాలు చేశారు. ప్రభుత్వ వైఖరిని నిందించారు. విద్యార్థుల జీవితాలతో ముఖ్యమంత్రి చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహించారు.

Leave A Reply

Your email address will not be published.