ఢిల్లీ (మెట్రో న్యూస్):
మహిళా ఎమ్మెల్యేలను పోలీసుల చేత అవమానించడం, అసెంబ్లీలోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం, శాసనసభ్యులుగా తమ హక్కులకు విఘాతం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని బీఆర్ఎస్ బృందం జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. శుక్రవారం ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు విజయ కిషోర్ రహత్కర్ ను బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిశారు.
అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గేట్ వద్ద జరిగిన సంఘటనలను ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి వివరించారు. వినతి పత్రం సమర్పించారు. అంతకుముందు జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతిని కూడా బిఆర్ఎస్ బృందం కలిసింది. అసెంబ్లీ ప్రాంగణంలో తమపై జరిగిన దాడి తీరును జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్ దృష్టికి తీసుకెళ్లారు.