Take a fresh look at your lifestyle.

Kodada Bus Accident | సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

0 19

Kodada Bus Accident | సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున కోదాడ మండలం దొరకుంట శివారులో రోడ్డుపై ఆగివున్న కంటైనర్ లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.

Kodada Bus Accident | సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

Kodada Bus Accident | సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున కోదాడ మండలం దొరకుంట శివారులో రోడ్డుపై ఆగివున్న కంటైనర్ లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఆరుగురు మృతిచెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.