మెట్రో ఈవినింగ్న
బిఆర్ఎస్ నాయకుడు తక్కెళ్లపల్లి రవీందర్ రావు పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని, ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలంగాణ రక్షణ సేన(టిఆర్ఎస్) ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎస్కే హుస్సేన్ పేర్కొన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షురాలు కవితమ్మ బహుజనుల బాణమని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం కవితమ్మ పని చేస్తోందన్నారు. రవీందర్ రావు గురించి అందరికీ తెలుసునని అన్నారు. తప్పుడు పద్ధతుల్లో డబ్బులు సంపాదించారని ఆరోపించారు. ఆయన ఎక్కడ పాదం మోపినా అక్కడ బిఆర్ఎస్ కు నష్టమేనన్నారు. మాట్లాడే ముందు నోరు అదుపులో ఉంచుకోవాలన్నారు. టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బంజారా విభాగం రాష్ట్ర అధ్యక్షులు బానోతు కిషన్ నాయక్ మాట్లాడుతూ.రవీందర్ రావు మాటలు దొర పలికినట్లుగా ఉన్నాయన్నారు. ఆయన లాగా మాట్లాడడానికి తమకు సంస్కారం అడ్డు వస్తోందన్నారు. బహుజనుల కోసం కవితమ్మ వచ్చిందని, దీనిని ఓర్వలేక పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని అన్నారు. వెంటనే కవితమ్మకు రవీందర్ రావు క్షమాపణలు చెప్పాలన్నారు. ఇకపై నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండింటిలోనూ బీసీ బిడ్డలకే టికెట్ ఇచ్చారన్నారు. పట్టభద్రులు తమ పార్టీని ఆదరించాలన్నారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ ఉపాధ్యాయ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మోరం వీర భద్రరావు, ఎస్టీ సెల్ జిల్లా ప్రెసిడెంట్ గుగులోత్ రాజ్ కుమార్ నాయక్, పార్టీ జిల్లా నాయకులు వనం నాగేందర్, కార్మిక సంఘం (టిఆర్టియు) జిల్లా అధ్యక్షులు జక్కుల ప్రకాశ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.