ఇషాన్ కిషన్ గాయపడ్డాడు. అతని కుడి కాలి తొడకండరం పట్టేసింది. స్వల్ప స్థాయిలో అతను నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతన్ని కివీస్‌తో జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు దూరం పెట్టారు. బీసీసీఐ ఇవాళ ఇషాన్ కిషన్ గాయంపై అప్‌డేట్ ఇచ్చింది. తొలి టీ20 సమయంలో అతను గాయపడ్డాడు. అయితే అతని ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ మెడికల్ టీమ్ ఫాలోఅవుతున్నది. ఫస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ సమయంలో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా మార్పు చేశారు. తొలి వికెట్ పడిన తర్వాత తిలక్ వర్మ, శ్రేయాస్ అయ్యర్ ముందు వరసలో బ్యాటింగ్‌కు దిగారు. రెండో టీ20కి ఇషాన్‌ను తప్పించడంతో.. ఆ బ్యాటర్ స్థానంలో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ఛాన్సు వచ్చే అవకాశం ఉన్నది. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో వైభవ్ స్టాండ్స్‌కే పరిమితమైన విషయం తెలిసిందే.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.