Take a fresh look at your lifestyle.

ప‌ట్టుబ‌డ్డ స్మ‌గ్లింగ్ ముఠా.. భారీగా న‌గ‌దు, బంగారం స్వాధీనం..!

0 12

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడ న‌గ‌రంలో బంగారం స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టయింది. విజయవాడ శివారులో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు చేస్తుండ‌గా ఈ ముఠా దొరికింది. వాళ్ల నుంచి ఓ వాహనంతోపాటు బస్సులో అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీ, బంగారం పట్టుకున్నారు. వాటి విలువ సుమారు రూ.5.84 కోట్లు ఉంటుంద‌ని అంచనా వేస్తున్నారు. బంగ్లాదేశ్‌ నుంచి కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు బంగారం తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

స్కార్పియో వాహనంలోని సీక్రెట్ డ్రాలో ఉన్న 60 వేల అమెరికన్‌ డాలర్‌లు, 21,500 యూరోల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ వైపు బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు బంగారం క్యారియర్లను అరెస్ట్‌చేశారు. వారు నడుముకు కట్టుకున్న పౌచ్‌లో 3.147 కిలోల బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌చేసి జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించారు. హైదరాబాద్‌ యూనిట్‌, విజయవాడ రీజినల్‌ యూనిట్‌ డీఆర్‌ఐ అధికారులు సమన్వయంతో ఈ ఆపరేషన్‌ చేపట్టారు. బంగారం స్మగ్లింగ్‌ ముఠాపై దర్యాప్తు కొనసాగుతున్న‌ద‌ని అధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.