Take a fresh look at your lifestyle.

హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం

0 14

తిరుమల :

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమల ఘనంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు హనుమంత వాహనంపై కోదండ రాముని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ధనుస్సు, బాణం ధరించి, తన పరమభక్తుడైన హనుమంతునిపై ఊరేగు తూ భక్తులను కటాక్షించారు. వాహనం ముందు భక్తబృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ వైభవంగా సాగింది.

భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. భగవద్భక్తులలో అగ్రగణ్యుడైన హనుమంతుడు శ్రీరామునిపై అచంచలమైన భక్తికి ప్రతీక. చతుర్వేద పండితుడు, అపార పరాక్రమశాలి అయిన ఆంజనేయునిపై శ్రీ మలయప్ప స్వామివారు విహరించడం భక్తులకు విశేష ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. గురుశిష్యులైన శ్రీరాముడు, హనుమంతుడి దివ్య సంబంధాన్ని ఈ వాహనసేవ స్మరింప జేస్తుంది.

ఈ వాహనసేవల్లో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు నరేష్ కుమార్, శాంతారామ్, రంగశ్రీ, జానకీ దేవి, సదాశివమ్, సీవీఎస్వో మురళీకృష్ణ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.