Take a fresh look at your lifestyle.

నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్

0 3

 హైదరాబాద్:

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్ నగర్ చౌరస్తా సమీపంలో జరిగిన దారుణ హత్య నగరంలో కలకలం రేపుతోంది. ఈ హత్య ఘటనకు సంబంధించిన లైవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇద్దరు రౌడీషీటర్ల మధ్య నడుస్తున్న పాత కక్షల నేపథ్యంలోనే ఓ గ్యాంగ్ వెంటాడి మరీ రౌడీషీటర్ పై దాడిచేతి, పదునైన వస్తువులతో పొడిచి హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

చిన్ననాటి మిత్రులే శత్రువులు అయ్యారా..
ఖమ్మం జిల్లా ఇల్లెందు పట్టణానికి చెందిన రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్ ప్రస్తుతం బండ్లగూడ సహభావన అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. చిన్ననాటి నుంచి కలిసి చదువుకుని, స్నేహంగా మెలిగిన మరో రౌడీషీటర్ ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్ తో గొడవలు ఉన్నాయి. వీరిద్దరిపై ఇప్పటికే పలు హత్య కేసులు ఉండటంతో పాటు ఇల్లెందు పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్లు కూడా ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రాణాలు తీసిన సెటిల్‌మెంట్ వివాదం…

సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బుల పంపిణీ విషయంలో గత 3 నెలలుగా నహీమ్, మహేష్ మధ్య తీవ్రమైన వివాదాలు నెలకొన్నాయి. ఈ వివాదాలు ముదిరి ముఠా కక్షలుగా మారాయి. ఈ ఆర్థిక తగాదాలతో నహీమ్ ను ఎలాగైనా హత్య చేయాలని మహేష్ గ్యాంగ్ ప్లాన్ చేసింది. ఈ క్రమంలో బండ్లగూడ ఆనంద్ నగర్ చౌరస్తా సమీపంలోని బార్ కు రౌడీషీటర్ నహీమ్ వెళ్లగా.. అక్కడికి వచ్చిన మహేష్, అతడి అనుచరులు కలిసి రాడ్లతో కొట్టి, పదునైన వస్తువులతో పొడిచి అంతా చూస్తుండగానే దారుణంగా హత్య చేశారు. సోమవారం రాత్రి దాదాపు 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న నాగోల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మహేష్, అతడి అనుచరుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపి తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా, మల్కాజ్‌గిరి సీసీఎస్ పోలీసులు ప్రధాన నిందితుడు ఉమామహేశ్వర్‌తో పాటు మరో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హత్యకు ఉపయోగించిన ఆయుధాలతో పాటు, వారి వాహనాన్ని సీజ్ చేసి విచారణ చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.