Take a fresh look at your lifestyle.

Accident | ఢిల్లీలో యాక్సిడెంట్‌ మహిళ మృతి, భర్తకు గాయాలు

0 25

Accident | ఒక కారు అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందగా, భర్తకు గాయాలయ్యాయి.

Accident | ఢిల్లీలో యాక్సిడెంట్‌ మహిళ మృతి, భర్తకు గాయాలు

Accident | ఢిల్లీ: సౌత్‌ ఢిల్లీలోని గ్రేటర్‌ కైలాశ్‌-1 ప్రాంతంలోని మెట్రో స్టేషన్‌ (Metro Station) సమీపంలో ఒక ఎస్‌యూవీ వాహనం పలు వాహనాలను, దంపతులను ఢీకొట్టింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి దంపతులను మూల్‌చంద్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో భార్య అప్పటికే మరణించిందని, భర్తకు గాయాలయ్యాయని డాక్టర్లు వెల్లడించారని పోలీసులు తెలిపారు. వీరిని శశి (71 ఏండ్లు), కుల్‌భూషణ్‌ (65)గా గుర్తించామని వెల్లడించారు.

గాయపడిన కుల్‌భూషణ్‌ వాంగ్మూలాన్ని (Statement) తీసుకుని కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహితలోని 281 (అజాగ్రత్తగా నడపటం), 125(ఎ) (ప్రజల ప్రాణాలు, భద్రతకు ముప్పు కలిగిచడం), 106 (అజాగ్రత్తతో వ్యక్తి మరణానికి కారణం కావడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.