Take a fresh look at your lifestyle.

భారతరత్న అవార్డును అందుకుంటున్న ఏటి ఆంజనేయులు

0 2

మెట్రో ఈవినింగ్స్:

సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు  అరుదైన గౌరవం తెలంగాణ భాష సాంస్కృతిక సౌజన్యం వారిచే శ్రీ వల్లూరి ఫౌండేషన్ వారు ఏటి ఆంజనేయులు దేశవ్యాప్తంగా సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీలో చేస్తున్నటువంటి కృషిని గుర్తిస్తూ రవీంద్ర భారతిలో వల్లూరి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్షాబంధన్ సెలబ్రేషన్ లో భాగంగా భారతరత్న పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరిగింది. ఈ అవార్డును గౌరవ మాజీ కేంద్ర మంత్రివర్యులు సముద్రాల వేణుగోపాల చారిమరియు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు బాబు మోహన్  వారి చేతుల మీదుగా శ్రీ ఏటి ఆంజనేయులు అందించడం జరిగింది .

ఈ సందర్భంగా ఏటి ఆంజనేయులు  మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంలో ఎంతోమంది నిరుపేదలకు వారు ఉండేటటువంటి సమస్యల పట్ల చొరవ తీసుకొని ఆ సమస్యలను సామరస్యంగా పరిష్కారం చేసినటువంటి సందర్భాలను గుర్తు చేసుకుంటూ భారతదేశంలో ఎక్కడ ఏ స్థాయిలో అవినీతి ఉన్నా కూడా వారి వెంట నీడలా వెంటాడే ఆయుధం సమాచార హక్కు చట్టం అని అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సమాచార హక్కు చట్టాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరచడం వలన నేడు సమాచార హక్కు చట్టం 2005ను దేశంలోని ప్రతి పౌరుడు సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారని అన్నారు .

ఇంతటి గొప్ప అవకాశం భారత రాజ్యాంగంలో కల్పించినందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సమాచార హక్కు చట్టం ప్రభుత్వానికి ప్రజలకు పారదర్శకంగా ప్రజలందరికీ సమాన న్యాయం కోసం అవినీతి అంతమే మన సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ఈ ఎన్జీవోస్ సంస్థ దేశంలోనే అతిపెద్ద గొప్ప సంస్థగా పేరుందిన విషయాన్ని అందరికీ తెలియజేశారు ఈ సంస్థ ద్వారా ఎంతోమంది అవినీతి అధికారుల భరతం పట్టినటువంటి విశేష అనుభవాలను తెలియజేశారు ఈ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు తమ బాధ్యతగా చట్టాల మీద అవగాహన పెంచుకున్నట్లయితే ఈ దేశంలో నేరాల సంఖ్య తగ్గి దేశం ప్రగతి బాటలో వెళ్లడానికి ఉపయోగపడుతుందని తెలియజేశారు ప్రత్యేకంగా ఇంతటి గొప్ప అవార్డుకు నన్ను ఎంపిక చేసిన శ్రీ వల్లూరి ఫౌండేషన్ వారి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

Leave A Reply

Your email address will not be published.