
Srisailam Crime News
శ్రీశైలంలోని సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య.
Srisailam Crime News: శ్రీశైలంలోని ఒక సత్రంలో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు ఫ్యాన్‌కు ఉరి వేసుకుంటే మరో ముగ్గురు బాత్రూమ్‌లో మరణించారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తులపల్లి గ్రామానికి చెందిన ఫ్యామిలీ ఈ నెల 20న శ్రీశైలం వచ్చారు. అక్కడ సత్రంలోని 11వ నెంబర్ రూమ్ అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుంచి బయటకు రాలేదు. అయితే ఆ రూమ్ నుంచి దుర్వాస వస్తుండటంతో సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చిన తర్వాత రూమ్ తెరిచి చూస్తే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. ఈ ఆత్మహత్యలకు ఆర్థిక వ్యవహారాలే కారణమని ప్రాథమికంగా నిర్దారించారు.