Take a fresh look at your lifestyle.

తిరుమల శ్రీవారి గర్భగుడిలో ఉన్న 5 విగ్రహాలు పంచబేరాల విశిష్టత

0 10

తిరుమల శ్రీవారి ఆలయంలో మÖలవిరాట్టుతో పాటు పంచబేరాలు కౌతుక, ఉత్సవ, స్నపన, బలిబేరాలు పూజలు- వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం ఈ ఐదు మÖర్తులకు ప్రత్యేకమైన సేవలు, పూజా విధానాలు కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు వెలసిన తిరుమల భూలోక వైకుంఠంగా విరాజిల్లుతోంది. సాత్తు శ్రీ మహావిష్ణువే ఏడుకొండలవానిగా పూజలందుకుంటున్న ఆనందనిలయంలో పూజలందుకునే 5 విగ్రహాలలో దేనిని దర్శించినా మÖలమÖర్తిని దర్శించినట్లే అని వేంకటాచల మహాత్యంలో వివరించి ఉంది.
పంచబేరాలు
శ్రీవారి గర్భగుడిలో మÖల విగ్రహంతో పాటుగా కౌతుక బేరం, ఉత్సవబేరం, స్నపన బేరం, బలిబేరం అనే విగ్రహాలు పూజలందుకొంటాయి. అంటే మొత్తంగా ఐదు విగ్రహాలుంటాయి. అవి వరుసగా ధ్రువబేరం, కౌతుక బేరం, స్నపన బేరం, ఉత్సవబేరం, బలిబేరం.
వైఖాసన ఆగమం ప్రకారం పూజలు ఈ ఐదు విగ్రహాలు శ్రీ వైష్ణవ వైఖాసన ఆగమం ప్రకారం సందర్భోచితంగా పూజలందుకొంటాయి. దక్షిణ భారతదేశంలోని అనేక వైష్ణవాలయాలు ఇదే వైఖానస లేదా పాంచరాత్ర ఆగమ సంప్రదాయాలను అనుసరిస్తాయి. అయితే తిరుమల క్షేత్రం వైఖానస ఆగమాన్నే ప్రధానంగా పాటిస్తుంది. ఇప్పుడు ఏ మÖర్తిని ఎందుకు ప్రార్ధిస్తారో చూద్దాం.
ధ్రువబేరం: గ్రామ శ్రేయస్సు కొరకు ద్రువబేరానికి పూజలు నిర్వహిస్తారు. ద్రువబేరమంటే మరేమి కాదు మÖలవిగ్రహమే. దీన్నే స్థిరమైన, చలించని విగ్రహంగా భావిస్తారు కనుకనే ఃఃధ్రువఃః అనే పేరు వచ్చింది. వైఖానసనాగము ప్రకారము గర్భగుడిలోని దేవుడు రెండు రకాలు. ఒకటి కంటికి కనిపించే బేరము, అంటే సాకార రూపమన్నమాట. రెండోది కంటికి కనబడని దేవుడు. ఈ దేవుడినే నిరాకారరూపుడని అంటారు. కనుక తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుని స్వరూపం సాకారమన్నమాట.

కౌతుక బేరం: సాధారణంగా మÖలబేరాన్ని శిల, మట్టి, దారువు అంటే చెక్కలతో నిర్మించాలి. వీటికే నిత్యపూజలు వైఖాసన లేదా పాంచరాత్ర ఆగమాల ప్రకారం పూజలు జరపాలి.ద్రువబేరానికి అభిషేకముండదు, ఎందుకంటే మÖల విగ్రహం అత్యంత పవిత్రమై నదిగా, స్పర్శకు అతీతమైనదిగా భావించబడు తుంది. పాలు నేయి తేనె పెరుగు వంటి వాటితో తిరు మంజన సేవ, అభిషేకాలు కౌతుకబే రానికి చేస్తారు. కౌతుకబేరమంటే దినసరిపూజకు ఏర్పాటుచేసిన బంగారు,వెండి లేదా పంచ లోహాలతో చేసిన విగ్రహం. మÖల విగ్రహంలో వుండే శక్తిని కౌతుకబేరము లోకి ఆవాహన చేసి పూజలు నిర్వహించి, సాయంత్రం పూజ ద్వారా తిరిగి ఆ శక్తిని మÖల విగ్రహంలోనికి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియనే
ఉద్వాసనమంటారు.
ఉత్సవబేరం: మÖడోదైన విగ్రహం
ఉత్సవ విగ్రహం. పుర ఊరేగింపునకు ద్రువబేరాన్ని తీసుకువెళ్ళటానికి వీలుకాదు కనుక ఉత్సవబేరాన్ని ఊరేగిస్తారు. తిరుమలలో ఈ ఉత్సవమÖర్తినే ఃఃమలయప్పస్వామిఃః అని పిలుస్తారు. బ్ర ్మత్సవాలు వంటి పర్వదినాలలో వాహనసేవలకు ఈ మÖర్తినే ఊరేగిస్తారు.స్నపన బేరం:స్నపనబేరాన్ని అమ్మవారి విగ్రహాలతో పాటుగా కోనేరుకు తీసుకువెళ్లి చక్రవారి స్నానం చేయిస్తారు. సాధారణంగా తిరుమంజన సేవలన్నీ ఈ స్నపనబేరానికే జరుగుతాయి.బలిబేరం: ప్రతి దేవాలయంలో ప్రధాన మÖర్తితో పాటు పరివార దేవతలుంటారు. వీరిని ఉపదేవాలయాలలో ఉంచి పూజిస్తారు. గరుడ, నంది, వినాయక, శ్రీదేవి భూదేవి, భైరవ, పరశురామ, బలరామ, యక్షగంధర్వ దేవతలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చును. చివరిది ఐదవదైన బలిబేరాన్ని పరివార దేవతలకు బలి ఇవ్వటానికి ముందు అర్చిస్తారు. బలి ఇవ్వడమంటే జంతువధ చేయడం కాదు. మÖల విగ్రహానికి నివేదన చేసిన అనంతరం ఈ దేవతలకు బలి అన్నమును సమర్పిస్తారు.

కొన్ని ఆగమవిధానాలలో మÖలవిగ్రహానికి అభిషేకము కూడా చేస్తారు. అలాగే తిరుమల శ్రీవారి మÖలమÖర్తికి కూడా ప్రతి శుక్రవారం అభిషేకం జరుగుతుంది. నిరాకార రూపుడైన భగవంతునికి ఆకారపూజా విధులేమి వుండవు, భక్తిప్రవృత్తులే ఇక్కడ ప్రధానం.ఈ పంచబేరాల విధానం కేవలం తిరుమలకే పరిమితం కాక, వైఖానస ఆగమాన్ని అనుసరించే అనేక దక్షిణ భారత వైష్ణవాలయాలలో కూడా విస్తృతంగా అమలులో ఉందని ఆగమశాస్త పండితులు పేర్కొంటారు. తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు మÖలమÖర్తితో పాటు ఇతర మÖర్తులను కూడా దర్శించుకోవడం వలన అభీష్టసిద్ధి కలుగుతుందని స్కందపురాణంలో వివరించి ఉంది. ఏడుకొండలవాని అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందించే ఈ పంచబేరాల దర్శనంతో జన్మ సాఫల్యం సిద్ధిస్తుందని వేంకటాచల మహత్యంలో వివరించి ఉంది. కలియుగ వెంకటనాథుని ఈ పంచబేరాల గురించి చదివినా, విన్నా సకల సంపదలు సిద్ధిస్తాయి.

ఏడుకొండలవాడా! వెంకటరమణా! గోవిందా! గోవిందా!

Leave A Reply

Your email address will not be published.