Take a fresh look at your lifestyle.

విద్యాసంస్థల భూములపై కాంగ్రెస్ సర్కార్ కుట్ర

0 13

విద్యాసంస్థల భూములపై కాంగ్రెస్ సర్కార్ కుట్ర : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు

హైదరాబాద్ : మెట్రో న్యూస్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా భ్రష్టుపట్టించి, విద్యాసంస్థల విలువైన భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ధారాదత్తం చేసేందుకు కుట్ర పన్నుతోందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఉదయం రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లకుండా పోలీసులు తార్నాకలోని ఆయన నివాసంలో అక్రమంగా గృహనిర్బంధం (హౌస్ అరెస్ట్) చేసిన నేపథ్యంలో, తన నివాసంలోనే అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ నాయక్, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్, తదితర నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ.. మొన్న నాంపల్లి పార్టీ కార్యాలయంలో చేపట్టిన ‘ఫీజుల బకాయి – బీజేపీ లడాయి’ నిరాహార దీక్షకు వేలాదిగా తరలివచ్చిన విద్యార్థుల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా ఉన్నారని గుర్తుచేశారు. జీవో 97 వల్ల తమ భవిష్యత్తు అంధకారంలో పడిపోతోందని, కాలేజీకి వచ్చి సమస్యలను పరిశీలించాలని వారు ఆహ్వానించినందునే తాను, పార్టీ యువమోర్చా బృందం రామంతపూర్ వెళ్లాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. విద్యార్థులను కలవడానికి వెళ్తుంటే పోలీసులను ఇంటి చుట్టూ మోహరించి నిర్బంధించడం కాంగ్రెస్ పిరికితనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. బీజేపీ చేస్తున్న పోరాటం కేవలం రెండు రోజుల దీక్షకో, ఫీజుల కోసమో కాదని.. ఇది తెలంగాణలోని యావత్ విద్యావ్యవస్థ, 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన జీవన్మరణ సమస్య అని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.