ఢిల్లీలోని చావ్రి బజార్లో ఉన్న మూడు అంతస్తుల భవనం కూలింది. ఆ బిల్డింగ్ శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, కొందరు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఓల్డ్ ఢిల్లీలోని చావ్రి బజార్లో ఉన్న మూడు అంతస్తుల భవనం కూలింది. ఆ బిల్డింగ్ శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, కొందరు గాయపడ్డారు. చావ్రి బజార్ మెట్రో స్టేషన్ సమీపంలో ఆ బిల్డింగ్ ఉన్నది. సంఘటన జరిగిన ప్రాంతానికి ఆరు అగ్నిమాపక దళాలు వెళ్లాయి. వాటర్ టెండర్స్ , రెస్క్యూ వాహనాలు రంగంలోకి దిగాయి. సీనియర్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. సెప్టెంబర్ 6వ తేదీన ఢిల్లీలోని సత్యా నికేతన్‌లో అయిదు అంతస్తుల పీజీ హాస్టల్ భవనం కూలిన ఘటనలో ఏడు మంది మృతిచెందిన విషయం తెలిసిందే.