Take a fresh look at your lifestyle.

సతీదేవి కుడికాలి బొటనవేలు పడిన శక్తిపీఠం

0 7

సతీదేవి కుడికాలి బొటనవేలు పడిన శక్తిపీఠం- 500 ఏళ్ల తర్వాత ఎగిరిన ధ్వజ పతాకం- పావాగఢ్ మహాకాళి ఆలయ విశిష్టత ఇదే!
సతీదేవి శరీర భాగాలు పడిన పవిత్ర ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా విరాజిల్లుతున్నాయి. వీటిలో సతీదేవి కుడికాలి బొటనవేలు పడిన శక్తిపీఠం ఏది? ఆ క్షేత్ర విశేషాలు, స్థల పురాణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.సతీదేవి శరీర భాగాలు పడిన పవిత్ర ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా విరాజిల్లుతున్నాయి. సాత్తు శ్రీ ఆది పరాశక్తి శక్తి రూపాలే ఈ అష్టాదశ శక్తి పీఠాలని భక్తుల విశ్వాసం. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని చెబుతారు. అందుకే ఈ క్షేత్రాలు అత్యంత విశిష్ఠమైనవని చెబుతారు. వీటిల్లో సతీదేవి కుడికాలి బొటనవేలు పడిన పవిత్ర శక్తిపీఠం గురించిన విశేషాలు చూద్దాం.
పావాగఢ్ మహాకాళి
గుజరాత్‌లోనిమాత ఆలయం పంచమహల్ జిల్లాలో ఉన్న పావాగఢ్ పర్వతంపై కొలువై ఉన్న మహాకాళి అమ్మవారు వెలసిన క్షేత్రం భారతదేశంలోని ప్రముఖ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. సుమారు 11వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన ఆలయం చంపానీర్, పావాగఢ్ పురావస్తు ప్రాంతం యొక్క శిఖరాగ్రాన ఉంది. సతీదేవి కుడికాలి బొటనవేలు ఈ క్షేత్రంలో పడిందని, అందుకే ఈ స్థలం దివ్య శక్తికి కేంద్రంగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే లక్షలాది మంది భక్తులు దేవి నవరాత్రులలో మాత్రమే కాకుండా ఏడాది పొడవునా అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఈ పవిత్ర క్షేత్రం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
500 ఏళ్ల తర్వాత ఎగిరిన ధ్వజ పతాకం
15వ శతాబ్దంలో సుల్తాన్ మహమÖద్ బెగ్డా ఈ ప్రాంతాన్ని ముట్టడించి, పావాగఢ్ కోటతో పాటు ఆలయ శిఖరాన్ని ధ్వంసం చేశాడు. ఆపై గర్భగుడిపై ఁసదన్‌షా పీరఁ దర్గాను నిర్మించాడు. ధ్వంసమైన ఆలయ శిఖరం, దర్గా వివాదం కారణంగా ఈ ఆలయంపై దాదాపు 500 సంవత్సరాల పాటు జెండా ధ్వజ పతాకం ఎగరలేదు. ఎందుకంటే శాస్తల ప్రకారం శిఖరం సంపూర్ణంగా ఉంటేనే ధ్వజారోహణ చేస్తారు. అనంతర కాలంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరడంతో, దర్గాను పక్కకు జరిపి ఆలయ శిఖరాన్ని పునర్నిర్మించారు. జూన్ 2022లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పునర్నిర్మించిన ఆలయంపై 500 ఏళ్ల తర్వాత మళ్లీ పవిత్ర ధ్వజ పతాకాన్ని ఎగురవేశారు.
జగజ్జనని- కల్యాణ స్వరూపిణి
పావాగఢ్ మహాకాళి అమ్మవారిని ఆదిశక్తిగా, జగజ్జననిగా, కల్యాణ స్వరూపిణిగా కొలుస్తారు. ఆలయ స్థల పురాణం ప్రకారం, విశ్వామిత్ర మహర్షి ఈ పర్వతంపై తపస్సు చేశారని, అమ్మవారి ఆరాధనతో ఈ స్థలం సిద్ధ పీఠం గా మారిందని ప్రతీతి. మహాకాళి అమ్మవారి ఈ ధామం గుజరాత్‌లోని మÖడు ప్రముఖ శక్తిపీఠాలైన అంబాజీ, బహుచరాజీ పావాగఢ్‌లలో అత్యంత ప్రధానమైనదిగా పరిగణించబడుతుంది.
యంత్రానికి పూజ
మహాశక్తి పీఠంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో గర్భాలయంలో మÖడు అమ్మవారి స్వరూపాలు దర్శనమిస్తాయి. ప్రధాన పీఠంపై కుడివైపున కాళికా దేవి, ఎడమవైపు బహుచరా మాత వెలసి ఉండగా, మధ్యలో మహాకాళి మాత దర్శనమిస్తుంది. ఇక్కడ విశేషమేమిటంటే గర్భాలయంలో అమ్మవారి విగ్రహానికి బదులుగా కాళీ యంత్రాన్ని పూజించడం విశేషం.

పూజోత్సవాలు
శరన్నవరాత్రులలో అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు, పూజలు జరుగుతాయి. ఇక ప్రతి మంగళవారం, శుక్రవారం అమ్మవారి సమక్షంలో రాహుకాల పూజలు, కుంకుమ పూజలు విశేషంగా జరుగుతాయి. ఈ క్షేత్రంలో రాహుకాల పూజలు నిర్వహిస్తే సమస్త గ్రహ దోషాలు తొలగుతాయని విశ్వాసం.

దర్శన ఫలం
పావాగఢ్ మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తిశ్రద్ధలతో పూజిస్తే అమ్మవారి కృప వల్ల భయం, ఆటంకాలు, శత్రు పీడలు మరియు ప్రతికూల శక్తులు నశించి, సాధకుడికి ధైర్యం, శక్తి మరియు ఆధ్యాత్మిక పురోగతి లభిస్తాయని విశ్వాసం.

ఎలా చేరుకోవాలి
గుజరాత్ రాష్ట్రంలోని అన్ని ప్రధాన జిల్లా కేంద్రాల నుంచి పావాగఢ్ మహాకాళి క్షేత్రానికి చేరుకోవడానికి మెరుగైన రవాణా సౌకర్యాలున్నాయి. సముద్ర మట్టానికి సుమారు 800 మీటర్ల ఎత్తులో వెలసి ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి మెట్ల సదుపాయంతో పాటు రోప్‌వే కూడా అందుబాటులో ఉంది.

జై మా పావాగఢ్ మహాకాళి!

Leave A Reply

Your email address will not be published.