Take a fresh look at your lifestyle.

ఎన్నిక‌లొస్తే కొట్లాడుడే

0 29

హైదరాబాద్ (మెట్రో న్యూస్‌):

  • ఎన్నిక‌లొస్తే కొట్లాడుడే
  • సీఎం ఫైట్ చేద్దామ‌న్నారు….
  • మీడియాతో దానం నాగేంద‌ర్

హైకోర్టు అన‌ర్హ‌త వేటు వేసిన నేప‌థ్యంలో… ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ త‌దుప‌రి నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. పై కోర్టుకు వెళ్లే ఆలోచ‌న ప్ర‌స్తుతానికి లేద‌ని శుక్ర‌వారం ప్ర‌క‌టించిన దానం… రాత్రి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి.. కోర్టు తీర్పు… త‌దుప‌రి ప‌రిణామాల‌పై కాసేపు చ‌ర్చించారు. తాజా ప‌రిస్థితుల‌ను సీఎంకు వివ‌రించారు. శ‌నివారం ఉద‌యం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన దానం… హైకోర్టు తీర్పు గురించి మాట్లాడేదేం లేద‌న్నారు. అయితే సుప్రీం కోర్టుకు కూడా వెళ్ల‌డం లేద‌ని క్లారిటీ ఇచ్చారు. ఉప ఎన్నిక వ‌స్తే… కొట్లాడుడే అన్నారు. ఫైట్ చేస్తా అని స్ప‌ష్టం చేశారు. నీవు ఫైటర్‌ కదా… ఫైట్ చేద్దామని సిఎం చెప్పార‌ని తెలిపారు. ముఖ్య‌మంత్రి త‌న‌కు ధైర్యం చెప్పార‌న్నారు. ఈ ఉత్సాహంతో… ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా.. పోటీ చేసి విజ‌యం సాధిస్తాన‌ని ఎమ్మెల్యే ధీమా వ్య‌క్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.