సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్
మెట్రో న్యూస్:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినంగా, ప్రజల ûనిజమైన స్వాతంత్ర్య దినంగా అధికారికంగా జరపాలని మనం ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు కోరుకున్నామని, నిర్మల్ జిల్లా బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ అన్నారు.
కానీ గత ప్రభుత్వాలు ఏంఐఎం నాయకులకు లొంగిపోయి, కేవలం ఓట్ల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసం ఆ వేడుకలను జరపలేదని, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వంసెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ డిమాండ్ చేసారు.
బుధవారం నిర్మల్ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా డిఆర్ఓ రాథోడ్ రమేష్ గారికి బీజేపీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.
1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందితే అందులో భాగమైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో వేడుకలు జరుపుకుంటున్నా, ఇక్కడ మాత్రం జరపకపోవడం దురదృష్టకరమన్నారు. ఓట్ల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్నే తాకట్టు పెట్టారని అయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే సెప్టెంబర్ 17న విముక్తి దినం జరపాలని డిమాండ్ చేస్తూ లాఠీ దెబ్బలు తిని, రక్తం చిందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆనాడు బీజేపీ చేసిన పోరాటం, డిమాండ్ మేరకు ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ముందుకు వచ్చి ఈ వేడుకలను నిర్వహిస్తోందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటాను సగర్వంగా ఎగురవేద్దామని అయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడిసేమ్మె రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి యాతాళం చిన్నారెడ్డి,బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ రమేష్ బుర్ర,కౌన్సిలర్ ధర్మాజీ గారి ఈశ్వర్, జిల్లా కౌన్సిల్ మెంబెర్ తోకల అనిల్, నాయకులు విజయ్ కుమార్, దీక్షిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.