మెట్రో ఈవినింగ్ :
తెలంగాణలో గిరిజనులకు 6 శాతం నుంచి 10 శాతానికి ఎస్టీ రిజర్వేషన్ పెంచి అమలు చేసిన చారిత్రాత్మక నిర్ణయాన్ని స్మరించుకుంటూ, ఖమ్మంలో తెలంగాణ భవన్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో వైరా ఎమ్మెల్యే చంద్రావతి అధ్యక్షతన గిరిజన నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైరా మాజీ ఎమ్మెల్యే డా. బానోత్ చంద్రావతి మాట్లాడుతూ, గిరిజనుల దశాబ్దాల ఆకాంక్షను గుర్తించి 10 శాతం ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయడంతో పాటు, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి గిరిజనులకు స్వయం పాలన, రాజకీయ ప్రాతినిధ్యం, ఆత్మగౌరవం కల్పించిన ఘనత కేసీఆర్ గారిదేనని పేర్కొన్నారు.
“10 శాతం రిజర్వేషన్ అనేది కేవలం శాతం పెంపు కాదు. గిరిజన యువత విద్య, ఉద్యోగాలు, భవిష్యత్తుకు ఇచ్చిన హక్కు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడం గిరిజనుల స్వయం పాలనకు వేసిన బలమైన పునాది” అని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గిరిజన విద్యకు ప్రాధాన్యత, గురుకులాల విస్తరణ, తండాలు మరియు గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పోడు భూముల సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలను గుర్తు చేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని నాయకులు విమర్శించారు. గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు, విద్యలో రిజర్వేషన్ ప్రయోజనాల సమర్థ అమలు, పోడు భూముల సమస్యలు, తండాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వసంత – సర్పంచ్, భగత్వీడు తాండా – బదావత్ అనుషా, గాయిగొళ్లపల్లి – బుగ్లోత్ మాధవి, మంగల్ తాండా – బాణోత్ దిక్షం నాయక్, గుర్వావత్ తాండా – జర్పులా బాలాజీ, బోడా మంచా నాయక్ – మాజీ సర్పంచ్/ఎంపీటీసీ, అమర్ సింగ్ – మాజీ జెడ్పీటీసీ, బోడా వీరకుమార్ – మాజీ సర్పంచ్, భుక్యా సాయి – స్టూడెంట్ ఆర్గనైజేషన్, తదితరులు పాల్గొన్నారు. అలాగే ధరావత్ శంకర్, బాణోత్ కొండా, బాణోత్ కిషన్, లకావత్ గిరిబాబు, మంచా నాయక్, భుక్యా కృష్ణా, బాణోత్ కిషన్ నాయక్, బాణోత్ బాలాజీ నాయక్, బాణోత్ భిక్షం, బాణోత్ రెడ్డియా నాయక్, మాళోత్ నాగేశ్వర్ రావు, శంకర్ నాయక్, జర్పులా వీరన్న, తేజవత్ రామ్మూర్తి తదితరులు మాట్లాడారు. వారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గిరిజన ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా సెప్టెంబర్ 17న నిర్వహించనున్న కార్యక్రమాల్లో గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని, 10 శాతం ఎస్టీ రిజర్వేషన్ సాధనకు ఉన్న చారిత్రాత్మక ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయాలని కోరారు.
“ఒక ప్రభుత్వాన్ని గిరిజనులు మాటలతో గుర్తుంచుకోరు. తమకు వచ్చిన హక్కులు, అవకాశాలు, ఆత్మగౌరవంతో గుర్తుంచుకుంటారు. ఆ విషయంలో కేసీఆర్ గారి నిర్ణయాలు తెలంగాణ గిరిజన చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి” అని పేర్కొన్నారు. గిరిజనులకు ఇప్పటికే సాధించిన హక్కులను కాపాడటంతో పాటు, ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యల కోసం బీఆర్ఎస్ గిరిజన నాయకత్వం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.
“గిరిజనులకు సాధించిన హక్కులను కాపాడటం, ఇంకా రావాల్సిన హక్కులను సాధించడం మా బాధ్యత. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం విషయంలో రాజీ ఉండదు” అని స్పష్టం చేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Prev Post