Take a fresh look at your lifestyle.

తిరుమలేశుని సేవ‌లో రాష్ట్ర గవర్నర్ శుక్లా దంప‌తులు

0 14

తిరుమ‌ల (మెట్రో న్యూస్‌): తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. దర్శనానంతరం వేద పండితులు గవర్నర్‌కు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను గవర్నర్ దంప‌తుల‌కు అందించారు.

అనంతరం గవర్నర్‌ కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలోని సి.రామాపురంలోని బ్రహ్మర్షి ఆశ్రమం, శ్రీ సిద్ధేశ్వర తీర్థ్‌లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. ఆ త‌ర్వాత గ‌వర్నర్ శుక్లా కుటుంబ స‌భ్యులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి పూజలు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.