ఖమ్మం మెట్రో ఈవెనింగ్ నవంబర్ 4:
జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుండి నిర్వహించనున్న చెకుముకి సైన్స్ సంబరాలు పోస్టర్ ను అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) శ్రీజ బుధవారం కలెక్టరేట్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. ఈ చెకుముకి టాలెంట్ పరీక్షల ద్వారా విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జెవివి జిల్లా అధ్యక్షులు ఎస్వి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి అలవాల నాగేందర్ , రాష్ట్ర కమిటీ సభ్యులు శివ నారాయణ ,జిల్లా కమిటీ సభ్యులు తాతా రాఘవయ్య , బంధం బాబురావు తదితరులు పాల్గొన్నారు.