Take a fresh look at your lifestyle.

జాయింట్ సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం మంత్రి పొంగులేటి

0 8

హైదరాబాద్ (మెట్రో న్యూస్):

రెవెన్యూ, అటవీ (ఫారెస్ట్) భూముల సరిహద్దు వివాదాలకు సంయుక్త సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ, ఫారెస్ట్, సర్వే అండ్ సెటిల్‌మెంట్ అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రెండు శాఖల సరిహద్దు తగాదాల వల్ల సాధారణ ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇకపై అలాంటి పరిస్థితులు తలెత్తకుండా రెండు విభాగాలు పూర్తి సమన్వయంతో క్షేత్రస్థాయిలో జాయింట్ సర్వేలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి అటవీ, రెవెన్యూ భూములకు స్పష్టమైన సరిహద్దులను గుర్తించాలని మంత్రి సూచించారు. దశాబ్దాలుగా నలుగుతున్న భూ వివాదాలకు శాశ్వతంగా తెరదించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. భూ పరిపాలనను బలోపేతం చేయడంలో భాగంగా సర్వే, సెటిల్‌మెంట్, భూ రికార్డుల శాఖ ద్వారా ప్రభుత్వం సమగ్ర సంస్కరణలు అమలు చేస్తోందని వెల్లడించారు. భూ రికార్డుల్లో పూర్తి పారదర్శకత, ఖచ్చితత్వం తీసుకొచ్చేందుకు అధికారులు పట్టుదలతో పనిచేసి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా, మండల స్థాయిల్లో రెవెన్యూ, అటవీ శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ ప్రక్రియ సఫీలుగా సాగేందుకు క్షేత్రస్థాయిలో రైతులు, ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, సర్వే అండ్ సెటిల్‌మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పీసీసీఎఫ్ వినయ్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.