మెట్రో ఈవినింగ్ నేలకొండపల్లి అక్టోబర్ 31..
భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలో ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సి ఓటు నమోదు కార్యక్రమం మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా పాగర్తి సుధాకర్ మాట్లాడుతూ అర్హత కల్గిన ప్రతి ఒక్క పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు, దేశంలో మొన్న జరిగిన ఎమ్మెల్సి ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సిటు కూడా రాలేదని త్వరలో జరగబోయే ఎమ్మెల్సి తెలంగాణా లో రెండు సీట్లు NDA బలపరిచిన అభ్యర్థులు గెలిసే అవకాశం ఉందని అన్నారు, అమలు కానీ హామీల తో ఈ రాష్ట్ర ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని అన్నారు, ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు సయ్యద్ మోహినూద్దీన్, కందరబోయిన గోపి, ఉప్పు శ్రీను లిక్కి నరేష్, చిట్యాల వీరబాబు తదితరులు పాల్గొన్నారు…