Take a fresh look at your lifestyle.

ఖాదీ కొనండి.. చేనేతకు అండగా నిలవండి!

0 5

(మెట్రో న్యూస్)

సీఈఆర్ క్లబ్‌లో ఖాదీ మేళా ప్రారంభం

మందమర్రి ఏరియాలోని సీఈఆర్ క్లబ్ ప్రాంగణంలో శనివారం ఖాదీ మేళా ఘనంగా ప్రారంభమైంది. ఎస్‌ఓ టు జి ఎం జి.ఎల్. ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ వస్త్రాలను కొనుగోలు చేయడం ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి, ఆర్థిక భరోసా కల్పించిన వారమవుతామని పేర్కొన్నారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు.

ఈ నెల 31 నుంచి ప్రతిరోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు మేళా అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఖాదీ వస్త్రాలపై 30 శాతం, పొందూరు ఖాదీ, కోసా పట్టు, ఉన్ని వస్త్రాలపై 20 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఖాదీ దుస్తులు, తువ్వాళ్లు, పరుపు దుప్పట్లు, కలంకారీ వస్త్రాలు, లుంగీలు, తివాచీలతో పాటు స్వచ్ఛమైన తేనె, సబ్బులు, అగరుబత్తులు, ఇతర గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులను విక్రయానికి ఉంచారు.

ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు

సింగరేణి కార్మికులు, ఉద్యోగులు రూ.20 వేల వరకు అప్పుగా ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. ఈ మొత్తాన్ని ఐదు సులభ వాయిదాల్లో నెలవారీ వేతనం నుంచి మినహాయించుకునే సదుపాయం ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, గృహిణులు, స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చేనేత కార్మికులకు చేయూతనివ్వాలని జి.ఎల్. ప్రసాద్ కోరారు.

ఈ కార్యక్రమంలో ఉప పర్సనల్ మేనేజర్ సందీప్, సీనియర్ వ్యక్తిగత అధికారి సత్యనారాయణ, మేళా ఇన్‌చార్జి చంద్రమౌళి, సంపత్, వెంకన్న, ఉద్యోగులు, స్థానికులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.