Take a fresh look at your lifestyle.

కోతుల దాడిలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు

0 9

(మెట్రో న్యూస్)

మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామపంచాయతీ పరిధిలో కోతుల దాడిలో వృద్ధురాలికి తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన బచ్చు లింగమ్మ అనే వృద్ధురాలు ఇంటి వద్ద ఉండగా ఒక్కసారిగా కోతుల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఇటీవల కాలంలో కలకోవ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువైందని, పలుమార్లు పంటలను, ఇళ్లలోకి చొరబడి ఇబ్బందులకు గురిచేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోతుల బెడదను నివారించేందుకు సర్పంచ్ మండవ వెంకటాద్రి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.