Take a fresh look at your lifestyle.

గుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు

0 3

హైదరాబాద్ (మెట్రో న్యూస్‌):

శ్రీ జనార్ధనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానంలో నిర్వహిస్తున్న తెలంగాణ వేద విద్వన్మహాసభలకు శనివారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదగిరి గుట్టపై ఉన్న అతిథి గృహం వద్దకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్‌కు మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్, వారి సతీమణి జానకి శుక్లాలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అర్చకులు వేదమంత్రాలతో వేదాశీర్వచనం అందజేశారు.

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్ శ్రీ స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాలను గవర్నర్‌కు అందజేశారు. అనంతరం దేవస్థానం రూపొందించిన 2027 నూతన వార్షిక క్యాలెండరు గవర్నర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దాన కిషోర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్, జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యులు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.