Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్

0 6

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

2027 మార్చిలో మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ ప‌ట్ట‌భ‌ద్రుల‌ నియోజకవర్గాలకు ఖాళీలు ఏర్పడనున్న నేపథ్యంలో కొత్తగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. ఈనెల 28న ఓటర్ల జాబితా ప్రక్రియపై ప్రజా నోటీసు ఇవ్వ‌నున్నారు. అక్టోబర్ 15న పత్రికల్లో తొలి పునఃప్రచురణ, అక్టోబర్ 25న రెండో పునఃప్రచురణ జ‌ర‌గ‌నుంది. నవంబర్ 6న ఫారం-18 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా నిర్దారించారు. నవంబర్ 20న ముసాయిదా ఓటర్ల జాబితా ముద్రణ పూర్తి అవుతుంది. నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ ఉంటుంది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ ఉండ‌నుంది. డిసెంబర్ 25 వ‌ర‌కు క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం పూర్తికానుంది. డిసెంబర్ 30 – తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ప్రస్తుత ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారు కూడా కొత్తగా ఫారం-18లో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువపత్రాలు, సర్టిఫికెట్ల ధృవీకరించిన కాపీలను సమర్పించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.