Take a fresh look at your lifestyle.

అరాచక శక్తులను గద్దె దించుతాం:టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత‌

0 5

హైదరాబాద్ (మెట్రో న్యూస్‌):

తెలంగాణ పోరాట యోధుల స్ఫూర్తితో అరాచ‌క శ‌క్తుల‌ను గ‌ద్దె దించుతామ‌ని టీఆర్ఎస్ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. సెప్టెంబర్ 17 నాటి పోరాటం గురించి కాంగ్రెస్, బీజేపీ చెప్పేవన్నీ అబద్దాలేన‌ని విమ‌ర్శించారు.
ప్రజలే తమను తాము కాపాడుకునేందుకు అనాడు సంఘటిత పోరాటాలు చేశారన్నారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన కవిత మాట్లాడుతూ, తెలంగాణ పౌరుషానికి, పోరాట పటిమకు, త్యాగ్యాల చరిత్రకు నిదర్శనమైన రోజు ఇది అని శ్లాఘించారు. కానీ సెప్టెంబర్ 17 కు సంబంధించి రకరకాల రాజకీయాలు చేస్తూ అబద్దాలు చెబుతున్నారని ఆమె తెలిపారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ మా స్టేట్ కాంగ్రెస్ పోరాటం చేసిందని ఆయన అబద్దాలు చెబుతున్నాడు. ముస్లిం రాజు మీద హిందూవులు చేసిన పోరాటమని బీజేపీ చెప్పే ప్రయత్నం చేస్తోంది. కానీ అదంతా అబద్దం. ప్రజలే తమకు జరిగిన అన్యాయాలపై పోరాటం చేసే విధంగా ఎంతో మంది మేధావులు వారిని చైతన్య పరిచారు. ఆనాటి జాగీర్ దార్లు, జమీందార్లపై పోరాటం చేసిన వాళ్లలో హిందూవులు, ముస్లింలు అందరూ ఉన్నారని క‌విత పేర్కొన్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని తుపాకీ పట్టి ప్రజలే పోరాటం చేశారు. పేదలకు భూములు ఇవ్వటం కాదు. పేదల భూములు లాక్కుందే కాంగ్రెస్ అని ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.