దశాబ్ద కాలంగా నియమిస్తున్న ఉప్పర్ ఫ్లైవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని యుద్ద ప్రాతిపదికన వేగంగా నిర్మించాలని ఆల్ ఇండియా వర్కర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాయబండి పాండురంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు.
బుధవారం రోజున ఉప్పల్ రింగ్ రోడ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉప్పల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని ఆల్ ఇండియా వర్కర్స్ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు వేమన శ్యాంప్రసాద్ అధ్యక్షతన నిరసన చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికిముఖ్య అతిథులుగా రాయబండి పాండురంగం హాజరై దశాబ్ద కాలంగా కేంద్ర ప్రభుత్వం రోడ్డు రవాణా శాఖ దాదాపుగా పది కిలోమీటర్ల పొడవున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి జాప్యంతో వ్యాపార సముదాయాన్ని తీవ్ర నష్టాలకు గురిచేస్తూ లక్షలాదిమంది వ్యాపారులు తీవ్రంగా ఇబ్బంది వాటిల్లుతుందని, దానికి ప్రధాన కారణం ఈ యొక్క బ్రిడ్జి నత్తనడక నడవడమే ప్రధాన కారణం అని అన్నారు.
ప్రతిరోజు రద్దీగా ఉండే ప్రజలు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఇబ్బందులు పడుతున్నారని హైదరాబాద్ మహానగరంలో వ్యాపార కేంద్రం పైన రహదారి గుండా నిర్మించడం వల్ల మంచిదే కానీ సంవత్సరాల కొద్దీ కాలయాపన చేయడం మూలంగా వాహనదారులు ప్రజలు వినియోగదారులు వ్యాపారులు భవన నిర్మాణ కార్మికులు ముఖ్యంగా ఈ రోడ్డు గుండా పవిత్రమైన పుణ్యక్షేత్రం యాదగిరి నరసింహస్వామి వరంగల్ తదితరు ప్రాంతాల వెళ్లడానికి ప్రధాన రహదారుల గుండా వెళ్లడానికి బ్రిడ్జి నిర్మాణం కాలయాపన చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందిని, అదేవిధంగా బ్రిడ్జి నిర్మాణం కాలయాపనతో దుమ్ము దూళి వాహనాల గుండా రావడంతో ప్రజలకు శ్వాస కోస వ్యాధులకు దారి తీస్తుందని అందుకు ఈ బ్రిడ్జిని యుద్ధ ప్రాతి పదికన నిర్మించాల్సిన అవసరం ఉందని,దీనికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజల పక్షానఆల్ ఇండియా వర్కర్స్ పార్టీ డిమాండ్ చేస్తున్నదని ఇంకా కాలయాపన చేస్తే సబ్బండ వర్గాల ప్రజలను కలుపుకొని ఆలిండియా వర్కర్స్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పాండురంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా వర్కర్స్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శివగల్ల శ్రీనివాసు ఆల్ ఇండియా ఆటో ఆర్గనైజేషన్ స్టేట్ కన్వీనర్ సిగిరెడ్డి హరిబాబు,ఐటి కమ్యూనికేషన్ & మీడియా రాష్ట్ర కన్వీనర్ తంగళ్ళపల్లి జయకరన్ , ఆల్ ఇండియా మహిళా ఆర్గనైజేషన్ హైదరాబాద్ అధ్యక్షులు సి స్రవంతి, ఆల్ ఇండియా వర్కర్స్ పార్టీ నాయకులు కొయ్యడ వెంకటేష్ గౌడ్ శ్రీనివాస్ చారి కొంపోజ్ శ్రీకాంత్ జక్కుల నాగయ్య. సాయి తదితరులు పాల్గొన్నారు .