Take a fresh look at your lifestyle.

నేడు తిరుమల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి… స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ

0 5

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు

రేపు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం

                                         తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తిరుమలకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు తిరుమలలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి… సాయంత్రం 5.30 గంటలకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి సాయంత్రం 6.20 గంటలకు శ్రీ గాయత్రీ నిలయానికి చేరుకుంటారు. రాత్రి 7.40 గంటలకు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. అనంతరం రాత్రి 7.55 గంటల నుంచి 9.15 గంటల వరకు వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించి, స్వామి వారిని దర్శించుకుంటారు. దర్శనం అనంతరం గాయత్రీ నిలయానికి చేరుకుని రాత్రి బస చేస్తారు.

తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

బుధవారం ఉదయం 8.40 గంటలకు వీఐపీ క్యూ కాంప్లెక్స్‌-1లోని 17వ కంపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన యాత్రికుల అనుభవ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 9.15 గంటలకు గోగర్భం డ్యామ్‌ సర్కిల్‌ వద్ద ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రారంభిస్తారు. 9.35 గంటలకు ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అధికారులతో సమావేశమవుతారు. తిరుమలలో కార్యక్రమాలను ముగించుకుని రేపు మధ్యాహ్నం 02.00 గంటలకు అమరావతి చేరుకుంటారు.
*****

Leave A Reply

Your email address will not be published.