Take a fresh look at your lifestyle.

రమేష్ రెడ్డి మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు

0 3

చేన్నవెళ్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రమేష్ రెడ్డి మృతి పట్ల జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం స్వగ్రామంలో జరిగిన అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, రమేష్ రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, దుష్యంత్ రెడ్డి స్వయంగా పాడె మోసి అంతిమయాత్రలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రమేష్ రెడ్డి పార్టీకి నమ్మకమైన నాయకుడిగా సేవలందించారని, ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. రమేష్ రెడ్డి కుటుంబానికి పార్టీ, తనవంతు అండగా ఉంటుందని భరోసా.

Leave A Reply

Your email address will not be published.