Take a fresh look at your lifestyle.

22 ఏ భూ దందా పై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరపండి : బీజేపీ

0 9

హైదరాబాద్ : మెట్రో న్యూస్
రాష్ట్రంలో జరుగుతున్న 22ఏ భూ దందా పై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో బీజేపీ ఎమ్మెల్యే లు పాయల్ శంకర్, దన్పాల్ సూర్యనారాయణ లు మాట్లాడారు. నాటి బీఆర్ఎస్ పదేళ్ల పాలన పంధాను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని వారు విమర్శించారు. నాడు ధరణి పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి పేరుతో అక్రమాలు సాగిస్తుందని తెలిపారు. 22ఏ పేర వ్యక్తి గత ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చే అవకాశం ఎవరిచ్చారాని వారు ప్రశ్నించారు. 22 ఏ అక్రమాలపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే లు డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.