హైదరాబాద్ : మెట్రో న్యూస్
స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్ పర్సన్ గా గద్వాల్ విజయలక్ష్మి సోమవారం ప్రజాభవన్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ప్రజా భవన్ కు విచ్చేసిన గద్వాల్ విజయలక్ష్మికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య విజయలక్ష్మి ఫైల్ పై సంతకం చేశారు.
అనంతరం సీఎం ప్రజావాణి హాల్ ను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కే కేశవరావు, వి. హనుమంతరావు, డాక్టర్ రోహిన్ రెడ్డి, ప్లానింగ్ శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ కే. విద్యాసాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.