Take a fresh look at your lifestyle.

మంత్రి భట్టి విక్రమార్కను కలిసిన నూతన ప్రణాళికా సంఘం వైస్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి

0 13

హైదరాబాద్‌,(మెట్రో న్యూస్):-

తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం నూతన వైస్‌ చైర్‌పర్సన్‌గా నియమితులైన శ్రీమతి గద్వాల విజయలక్ష్మి శనివారం ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా విజయలక్ష్మికి ఉప ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సమతుల్య ప్రగతిని లక్ష్యంగా చేసుకుని ప్రణాళికా సంఘం మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందేలా ప్రణాళికలు రూపొందించడంలో ప్రణాళికా సంఘం కీలకపాత్ర పోషించాలని భట్టి విక్రమార్క సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తూ రాష్ట్ర ప్రగతికి మరింత దోహదపడాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.