Take a fresh look at your lifestyle.

లాక్రోస్ విజేతలను సత్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్

0 16

హైదరాబాద్:

మెట్రో న్యూస్ మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన సౌత్ ఈస్ట్ కోస్ట్ లాక్రోస్ ఛాంపియన్‌షిప్ 2026లో భారత మహిళా జట్టు కాంస్య పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన బీసీ గురుకుల విద్యార్థినులు పి. గోపిక, సంగీతలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు.
అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టులో ఆడి దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి, బీసీ గురుకులాలకు ఖ్యాతి తీసుకువచ్చిన విద్యార్థినులను మంత్రి పొన్నం ప్రభాకర్ శాలువాతో సత్కరించారు. తృతీయ బహుమతి సాధించి దేశ ప్రగతిని చాటినందుకు విద్యార్థులకు 25వేల రూపాయల నగదు బహుమతి, వారి ప్రయాణ ఖర్చులకు 1,76,000రూపాయలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులతో పోటీపడి భారత మహిళా జట్టు కాంస్య పతకం సాధించగా, అందులో బీసీ గురుకుల విద్యార్థినులు గోపిక, సంగీత భాగస్వామ్యం కావడం తెలంగాణకు గర్వకారణమన్నారు.
క్రీడల్లో రాణించే విద్యార్థులకు ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తుందని, ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి అన్నారు. క్రీడల్లో విద్యార్థినుల ప్రతిభను గుర్తించి వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొన్నేందు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి అన్నారు.

గోపిక, సంగీత ఐదో తరగతిలోనే బీసీ గురుకుల పాఠశాలలో చేరారని, వారిలో లాక్రోస్ క్రీడపై ఉన్న ఆసక్తి, ప్రతిభను గుర్తించి ప్రత్యేక శిక్షణ అందించామని సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరూ బీసీ గురుకుల కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నారని, గతంలో కర్నూలు, చెన్నైలో జరిగిన సౌత్ జోన్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో వీరిద్దరూ బంగారు పతకాలు సాధించారని, ఆగ్రా, జమ్మూకశ్మీర్‌లో జరిగిన పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు. తాజాగా మలేషియాలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించడం వారి క్రీడా ప్రతిభకు నిదర్శనమన్నారు.
విద్యార్థినులకు క్రీడా శిక్షణ అందించిన లాక్రోస్ కోచ్‌లు పరమేశ్, ఆకాష్, ప్రిన్సిపాల్ శ్రీలతలను మంత్రి అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.