Take a fresh look at your lifestyle.

ఆరోగ్య రంగంలో అద్భుత ప్రగతి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

0 14

హైదరాబాద్ (మెట్రో న్యూస్):

​హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కిడ్నీ సింపోజియం-2026 కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కిడ్నీ సంరక్షణ, అవయవ మార్పిడి మరియు ఆధునిక వైద్య చికిత్స రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న యశోదా హాస్పిటల్స్‌లోని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెనల్ సైన్సెస్’ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆరోగ్య రంగంలో దేశం సాధిస్తున్న ప్రగతిని మరియు కిడ్నీ వ్యాధుల నివారణ ప్రాముఖ్యతను ఆయన వివరించారు. గత దశాబ్ద కాలంలో భారతదేశ వైద్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఆయన తెలిపారు. దేశంలో వైద్యవైద్య రంగంలో కేంద్ర ప్రభుత్వ చొరవ – గణనీయమైన మార్పులు* విద్య మరియు మౌలిక వసతులు భారీగా విస్తరించాయని పేర్కొన్నారు.

​2014లో 387గా ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్య నేడు 846కు పెరిగింది. ​51,348 ఎంబిబీఎస్ సీట్ల నుంచి దాదాపు 1.4 లక్షలకు చేరుకున్నాయి. 2014లో కేవలం 7 ఎయిమ్స్ ఉండగా, నేడు దేశవ్యాప్తంగా 23 ఎయిమ్స్‌లు సేవనందిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య సేవలను ప్రజలకు చేరువ చేయడానికి 1.86 లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారని‌ వివరించారు.
​ఆయుష్మాన్ భారత్ ద్వారా సుమారు రూ. 2 లక్షల కోట్ల విలువైన వైద్య ఖర్చుల భారం సామాన్యులపై తగ్గింది. అలాగే 20,000 పైగా జన్ అషధీ కేంద్రాల ద్వారా తక్కువ ధరలకే నాణ్యమైన జనరిక్ మందులు అందుబాటులోకి వచ్చాయన్నారు.

Leave A Reply

Your email address will not be published.