Take a fresh look at your lifestyle.

సోదరీ సోదరుల ప్రేమాభిమానాలకు ప్రతీక రాఖీ.. పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌

0 11

సోదరీ సోదరుల ప్రేమాభిమానాలకు ప్రతీక రాఖీ పండుగ అని తెలంగాణ తొలి సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల అనుబంధం అజరామరమని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

సోదరీ సోదరుల ప్రేమాభిమానాలకు ప్రతీక రాఖీ.. పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): సోదరీ సోదరుల ప్రేమాభిమానాలకు ప్రతీక రాఖీ పండుగ అని తెలంగాణ తొలి సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల అనుబంధం అజరామరమని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రక్షా బంధన్‌ పర్వదినం భారత కుటుంబ జీవనంలో ప్రత్యేక సంప్రదాయ, సాంస్కృతిక వేడుకగా నిలిచిందని కేసీఆర్‌ తెలిపారు.

దేశ ప్రజలందరూ ద్వేషం, స్వార్థం వీడి సౌభ్రాతృత్వంతో కలిసిమెలిసి జీవించడం ద్వారానే వసుధైక కుటుంబ భావన పరిఢవిల్లుతున్నదని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.