Take a fresh look at your lifestyle.

మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్

0 16
  • భూములను అమ్ముకోవడమే ప్రభుత్వ లక్ష్యం
  • మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్

  హైదరాబాద్ (మెట్రో న్యూస్):

కూకట్‌పల్లిలో 22ఏ బాధితులకు బీఆర్ఎస్ పక్షాన అండగా ఉంటామని హరీశ్ రావు భరోసా ఇచ్చారు. బుధవారం కూకట్‌పల్లి పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీ ఎన్‌ఆర్‌ఎస్‌ఏ కమ్యూనిటీ హాల్‌లో 22ఏ నిషేధిత భూముల సమస్యతో ఇబ్బంది పడుతున్న బాధిత కుటుంబాలతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు సమావేశమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 22ఏ బాధితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాధితుల ఆవేదనను స్వయంగా అడిగి తెలుసుకున్న హరీశ్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో పరిస్థితి ఏమిటి? ప్రజల సమస్యలు పరిష్కరించడం కంటే, ప్రభుత్వ భూములను అమ్ముకోవడానికే ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.
హౌసింగ్ బోర్డు భూములు, టీజీఐఐసీ భూములు.. ఇలా ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపిస్తే అక్కడ బోర్డు పాతేసి అమ్మకానికి పెట్టడమే కాంగ్రెస్ విధానంగా మారింది. రేవంత్ రెడ్డి రాగానే ఈ తక్కువ కాలంలోనే సుమారు రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను తెగనమ్మేశాడు. కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న సామాన్యుల భూములను మాత్రం రాత్రికి రాత్రే 22ఏ నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను వేధిస్తున్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. 22ఏ బాధితుల పక్షాన, సామాన్యుల ఆస్తుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచైనా సరే రాజీలేని పోరాటం చేస్తాం.

Leave A Reply

Your email address will not be published.