దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ప్రత్యేకచొరవ,తీసుకుంటున్నారని కౌకుంట్ల, అడ్డాకుల మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సుమారు వెయ్యి రోజుల్లో రూ.వెయ్యి కోట్ల విలువైన అభివృద్ధి పనులు సాధించడం నియోజకవర్గానికి గర్వకారణమని వారు అన్నారు.కౌకుంట్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు మాదిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పలు రహదారులు, వంతెనల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. ఆయన చొరవతో NH-44 నుంచి ఇస్రంపల్లి, పెద్దమునగల్‌చేడ్ మీదుగా కౌకుంట్ల వరకు రహదారి అభివృద్ధి, హెచ్బిఎల్ నిర్మాణానికి రూ.35 కోట్లు మంజూరైనట్లు చెప్పారు.
అదేవిధంగావెంకంపల్లి–రేకులంపల్లి మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.1.80 కోట్లు, దేవరకద్ర–ఆత్మకూర్ రోడ్డులోకౌకుంట్ల–రాచాల, ఇస్రంపల్లి వద్ద వంతెనల నిర్మాణానికి రూ.5.40 కోట్లుమంజూరైనట్లువెల్లడించారు.వర్షాకాలంలో ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్రఅంతరాయం,ఏర్పడటంతో పాటు గతంలో ప్రాణ, పశు నష్టాలు, విద్యుత్ స్తంభాలు, మోటార్లు, పైప్‌లైన్లు కొట్టుకుపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయని నాయకులు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా చొరవ చూపారని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే కీలకంగా వ్యవహరించారని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు.ముఖ్యమంత్రిరేవంత్,రెడ్డి,పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సహకారంతో అభివృద్ధి పనులకు నిధులు సమకూరుతున్నాయని తెలిపారు. కౌకుంట్ల, అడ్డాకుల మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల తరఫున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.