ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు.
ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని, వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో డాక్టర్ వైఎస్సార్ ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేసుకున్నారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, పేదలకు గృహ నిర్మాణం, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచిన ప్రజానాయకుడని పేర్కొన్నారు.