Bigg Boss Telugu Season 10 : అవెయిటెడ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లాంచింగ్ డేట్ వచ్చేసింది. ఈసారి ఆటలో కాదు ఆటే సవాల్ అంటూ నాగార్జున చేసిన వీడియో ట్రెండ్ అవుతోంది.

Nagarjuna’s Bigg Boss Telugu Season 10 Contestants List : తెలుగు ఫేమస్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 10 కోసం రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే సామాన్యుల ఎంట్రీ కోసం అగ్నిపరీక్ష ఫుల్ జోష్‌లో కంటిన్యూ అవుతుండగా… తాజాగా షో ప్రారంభమయ్యే డేట్ అనౌన్స్ చేశారు.
బిగ్ బాస్ సీజన్ 10 ఎప్పుడంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు లాంచ్ కానుంది. స్టార్ మా, జియో హాట్ స్టార్ ఓటీటీలో ప్రసారం కానుంది. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తుండగా… ఈసారి ఆటలో కాదు… ఆటే సవాల్ అంటూ రీసెంట్‌గా చేసిన వీడియో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. గత సీజన్ల కంటే పదింతలు ఎంటర్టైన్మెంట్, థ్రిల్లింగ్ పంచేలా గేమ్ ఉండబోతోందని చెప్పకనే చెప్పారు. బిగ్ బాస్ హౌస్‌లో ఎవరూ ఊహించని సర్‌ప్రైజెస్, డ్రామా, సవాళ్లు, ట్విస్టులు పది రెట్లు ఉంటాయని అర్థమవుతోంది.
గ్నిపరీక్ష సీజన్ 2 సవాళ్లు
ఈ సీజన్‌లోనూ సామాన్యులకు హౌస్‌లో అవకాశం కల్పించనున్నారు. వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ‘అగ్నిపరీక్ష సీజన్ 2’ నిర్వహిస్తుండగా… అందులోనూ గేమ్ స్ట్రాటజీస్ టఫ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్స్ అందరూ పోటా పోటీగా టాస్కులు పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు బెస్ట్ గేమ్‌తో ఓట్ అప్పీల్ చేసుకుంటున్నారు. మరికొందరు ఎల్లో కార్డ్ అందుకుని డేంజర్ జోన్‌లో ఉన్నారు. మరికొద్ది రోజుల్లో అగ్నిపరీక్ష సీజన్ 2 ముగియనుంది. మొత్తం 15 మందిలో బెస్ట్‌గా నిలిచిన నలుగురి నుంచి ఐదుగురిని హౌస్‌లోకి పంపనున్నారు.
కంటెస్టెంట్స్ ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరనేది ఆసక్తిగా మారింది. ముఖేష్ గౌడ (గుప్పెడంత మనసు రిషి), పల్లవి గౌడ, తేజస్విని గౌడ, కావ్యశ్రీ, జబర్దస్త్ రాంప్రసాద్, పొట్టి నరేష్, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబర్ నందు, కడలి సత్యనారాయణ, యాంకర్ వర్షిణి, నటుడు కృష్ణుడు, టెంపర్ వంశీ, ఫోక్ డ్యాన్సర్ మాథురీ రాథోడ్, బెంగాళీ భామ, సీరియల్ నటి దేబ్జానీ మోదక్ తదితరులు ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై లాంచింగ్ రోజే క్లారిటీ రానుంది.